![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వీక్ షో ఫుల్ ఫన్నీగా ఉంది. ఇక ఇందులో టీచర్స్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. నూకరాజు ఐతే ఇంద్రజ కాళ్ళ మీద పడి బ్లేసింగ్స్ తీసుకున్నాడు. ఇండస్ట్రీలో అమ్మ అని పిలిచిన ఆవిడ ఒక్కరే అన్నాడు. ఇంద్రజ అంటే ప్రేమ, గౌరవం ఉన్నాయని చెప్పాడు.
ఇక తర్వాత రాంప్రసాద్ వచ్చి "అరేయ్ రష్మీ నువ్వు కూడా నా కాళ్ళమీద పడు" అన్నాడు. "ఎందుకు పడాలి" అంది రష్మీ. "నీకు ఎన్ని నేర్పించాను నేను" అన్నాడు. "ఏం నేర్పించావ్ " అంది. "సుధీర్ గాడిని పరిచయం చేసి ట్రాక్ పెట్టింది నేనే" అన్నాడు రాంప్రసాద్. "ఆ కాళ్ళ మీద పడడం కాదు ఈ ఒక్క విషయం వల్ల ఈ కాళ్ళనే కాదు అన్నీ నరికేయాలి" అంది సీరియస్ గా. ఆ కామెంట్స్ తో రాంప్రసాద్ షాకయ్యాడు.
బుల్లితెర మీద సుధీర్ - రష్మీ లవ్ ట్రాక్ గురించి చెప్పక్కర్లేదు. ఒక రేంజ్ లో పాపులర్ అయ్యారు వీళ్ళు. ఆ తర్వాత సుధీర్ ఈటీవీని వదిలేసాడు. కానీ రష్మీ మాత్రం జబర్దస్త్ ని, శ్రీదేవి డ్రామా కంపెనీని మాత్రం వదల్లేదు. సుధీర్ అటు మూవీస్, షోస్ చేస్తూ ఉన్నాడు. ఇక రష్మీకి జబర్దస్త్ లో కో-హోస్ట్ గా ఇప్పుడు మానస్ చేస్తున్నాడు. రష్మీ-సుధీర్ పెళ్లి చేసుకుంటే చూడాలని చాలామంది కోరుకుంటూ ఇప్పటికీ షో ప్రోమోస్ కింద పోస్ట్ చేస్తూనే ఉంటారు.
![]() |
![]() |